Headlines:
-
ఖమ్మంలో కుల వివక్షత పెరుగుతుందని ప్రస్తుత పరిస్థితి!
-
కుల వివక్షతపై బాణోత్ భద్రునాయక్ తీవ్ర విమర్శలు
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి
-
ఖమ్మం జిల్లాలో కుల వివక్షతపై పెరిగిన దారుణ పరిస్థితి – సమాజంలో ఉద్రిక్తతలు
-
బీజేపీ ప్రభావం, కుల వివక్షతపై చర్చ: ఖమ్మం జిల్లాలో సమాజిక న్యాయం అవసరం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేధిక జిల్లా కన్వీనర్ బాణోత్ భద్రునాయక్
ఖమ్మం, నవంబర్ 24: మత సామరశ్యానికి చిరునామాగా ఉన్న ఖమ్మం జిల్లాలో కుల వివక్షత జాఢ్యం వెలుగుచూడడం దారుణమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేధిక జిల్లా కన్వీనర్ బాణోత్ భద్రునాయక్ ఆదివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కరుణగిరి ప్రాంతంలోని ఒక అపార్ట్ మెంటులో మాత్రమే ఇలాంటి ఉదంతం చోటుచేసుకుందని, మరెక్కడా లేదని భావించడం తప్పని ఖమ్మంలోని చాలా ప్రాంతాలలో వెలుగు చూడని కుల వివక్షత దాగిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడో హైదరాబాదు లేదా కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మాత్రమే మత కలహాలు జరగడం, కుల వివక్షత ఘటనలు చోటుచేసుకోవడం చాలా సార్లు మనం గమనించి ఆశ్చర్యపోతున్నాము. నిజానికి ఇది ఖమ్మంలో కూడా ఎప్పటినుండో కానరాకుండా జరుగుతోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే చిన్నచూపుకు కారణం గత దశాబ్ద కాలం నుంచి బాగా పెరిగిన బీజేపీ ప్రాభల్యం దీనిని ఖమ్మం జిల్లాలోని కుల ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించడమే కాకుండా, దీనిపై ఒక కార్యచరణను రూపొందించాలని కోరారు. మతతత్వ, కులతత్వ, విక్షను ప్రదర్శిస్తున్న నిందితులను కఠినంగ శిక్షించాలని డిమాండ్ చేశారు.