కులగణన సర్వే తప్పుల తడక – కాంగ్రెస్ బీసీ లపై భారీ కుట్ర

కులగణన సర్వే తప్పుల తడక

– కాంగ్రెస్ బీసీ లపై భారీ కుట్ర

– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు

-ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉందనీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేల నాగరాజు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ లెక్కలను తక్కువ చేసి అగ్ర కులాల జనాభా ను ఎక్కువ చేసి చూపించడం ఇది బీసీ లని అవమానించడమే అన్నారు.2014 లో బీసీ లు 51 శాతం ఉంటే 2024 లో 46 శాతం ఉంటారా అని ప్రశ్నించారు. బీసీ సబ్ కమిటీ కి బట్టి, పొన్నం ఉండాలి కానీ,ఉత్తమ్ ఎలా ఉంటాడు అన్నారు. ఇక్కడే కాగ్రెస్ కుట్ర అర్థం అవుతుందన్నారు. కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసింది, ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని,2014 నుంచి 2024 వరకు 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర అని బిసిలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.

మళ్ళీ బీహార్ తరహా లో రెండో సారి కుల గణన సర్వే చేయాలి అని, బీసీ కుల గణన సర్వే పై ప్రభుత్వం పున సమీక్ష చేయాలని అలా చేయకుంటే కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి దయాకర్,nకార్యదర్శి శ్రవీణ్, మోహన్ చారి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment