ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ ఇంట్లో సీబీఐ సోదాలు

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ ఇంట్లో సీబీఐ సోదాలు…

IMG 20240826 WA0017

మహిళా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారానికి గురైన కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ ఆదివారం సోదాలు జరిపింది.ఇదే కేసుకు సంబంధించి మాజీ ప్రిన్సిపాల్‌ సంజయ్‌ వశిష్ట్‌తోపాటు మరో 13 మంది ఇళ్లలోనూ సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ప్రశ్నించారు. ఆస్పత్రికి సరఫరా అయ్యే పలు రకాల ఉత్పత్తులకు సంబంధించిన లావాదేవీలపైనా ఆరా తీశారు. సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఈ సోదాల్లో పాలుపంచుకుంది. కాగా, సందీప్‌ ఘోష్‌ ఇంటికి ఉదయం 6 గంటలకు చేరుకున్న సీబీఐ బృందం.. గంటన్నరపాటు బయటే వేచి చూసింది. ఆ తర్వాతే ఘోష్‌ తన ఇంటి తలుపు తెరిచారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌పై ఫోరెన్సిక్‌ నిపుణులు ఆదివారం లై డిటెక్టర్‌ పరీక్ష జరిపారు.

Join WhatsApp

Join Now