Headlines (Telugu):
-
“కేసీఆర్ అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ డిమాండ్”
-
“తెలంగాణలో కేసీఆర్ విధ్వంసం: TRS (D) పాదయాత్రకు సిద్ధం”
-
“కేసీఆర్ కుటుంబ విదేశీ పెట్టుబడులు: సిబిఐ విచారణ అవసరం”
-
“కేసీఆర్ పాలనలో వేల కోట్ల అవినీతి ఆరోపణలు – TRS (D) డిమాండ్”
-
“కేసీఆర్ పాలనపై TRS (D) ఆందోళన, సమగ్ర దర్యాప్తు కోరుతున్న ప్రజలు”
*TRS ( D) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులునరాల సత్యనారాయణ డిమాండ్*
*కెసిఆర్ అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజలకు వివరించడానికి డిసెంబర్ 6వ తేదీన భద్రాచలం నుండి పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. తెలంగాణ 33 జిల్లాలలో పాదయాత్ర చేస్తాం*
కెసిఆర్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణలో విధ్వంసం జరిగినది
కాలేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగింది. చత్తీస్గడ్ విద్యుత్ ఒప్పందంలో వేలకోట్ల అవినీతి జరిగింది. భూ బదలాయింపులలో వేల కోట్ల అవినీతి జరిగింది. కెసిఆర్ కుటుంబం విదేశాలలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. వీటన్నిటిపై సిబిఐ, ఈడి, ఏసీబీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
అక్రమ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు కేసీఆర్ పరిపాలన ముగిసిన తర్వాత విదేశాలకు పారిపోయారు. వాళ్లకు గ్రీన్ కార్డులు కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ పది సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు. నిరుద్యోగం పెరిగింది. పేదరికం పెరిగింది. ఆదాయసమానతలు పెరిగాయి. డబల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు. ఆదివాసి పంట భూములను అటవీ శాఖ అధికారులతో కలిసి సర్వనాశనం చేశారు. దళిత బందు లేదు, గిరిజన బందు లేదు. బీసీ బందు లేదు. ఫోన్ టాపింగులు జరిగాయి. ఆఫీసుల్లో అరాచకత్వం రాజ్యమేలింది. కుటుంబ పాలన కొనసాగింది. వేలకోట్ల రూపాయల అవినీతి జరిగింది. వీటన్నిటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం
*ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మైల సురేఖ, రాష్ట్ర కార్యదర్శి పోచబోయిన రేఖ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి శారద, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మందా లావణ్య, వల్లూరి శ్రీలత, గద్దెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు