పివి కాలనీ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

IMG 20240828 WA2668

IMG 20240828 WA2669

 

పోలీసు ఎక్సైజ్ శాఖల సమన్యయం తో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి

ఏరియా యస్ ఓ టు జిఎం డి శ్యాంసుందర్ గారికి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె బాబూ రావు

పివి కాలనీ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ పోలీసు ఎక్సైజ్ శాఖల సమన్యయం తో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని కోరుతూ మణుగూరు సామాజిక సేవకులు కర్నె బాబురావు బుధవారం నాడు ఏరియా యస్ ఓ టు జిఎం డి శ్యాంసుందర్ కి, యస్ ఐ మేడ ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి కాలనీ పరిధిలోని మల్లారం కాలనీ ఎస్ టి పి ప్లాంట్ (మురుగునీటి శుద్ధి కర్మాగారం) ఫిల్టర్ బెడ్ వద్ద, కూనవరం వాటర్ ట్యాంక్ వద్ద, కూలగోట్టిన క్వార్టర్ల వద్ద,పైలట్ కాలనీ ఎంవీటిసి సమీపంలో మరుగు ఉన్న ప్రాంతాలలో పగలనక రేయనక గంజాయి, సిగరెట్లు మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిపోతోందనీ. ఈ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా తయారయ్యాయనీ ప్రత్యేకించి యువకులు చెడు అలవాట్లకు బానిసలవుతూ తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువకులు రోడ్డు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పలు రోడ్డు ప్రమాద సంఘటనలే అందుకు నిదర్శనం అన్నారు.. తల్లిదండ్రులను కూడా వీరు లెక్క చేయని పరిస్థితి. మద్యం మత్తులో కొంతమంది యువకులు మద్యం సీసాలను రోడ్లపైనే పగలగొట్టి తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారనీ. పోలీసులు పెట్రోలింగ్ కానీ ఇతరులు కానీ పట్టించుకోరు కనుక ఇతర ప్రాంతాల నుండి కూడా పి వి కాలనీకి వ్యసనపరులు తరలివస్తున్నారన్నారు. కొన్ని పాన్ షాపులలో చుట్టూ గ్రీన్ మ్యాట్ లు కట్టి కూర్చోవడానికి కుర్చీలు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి ధూమపానాన్ని మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోందన్నారు.గంజాయి సేవించే వారే కాకుండా అమ్మే వారి సంఖ్య కూడా కాలనీలో రోజురోజుకీ పెరిగిపోతోందనీ. ఇక బెల్ట్ షాపుల సంగతి మీకు తెలిసిందే కొంతమందికి బెల్టు షాపులు ఉపాధి కల్పనా కేంద్రాలుగా మారిపోయాయన్నారు. ఉదాహరణకు మల్లారం రైల్వే గేట్ నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు దారి పొడుగునా నేషనల్ హైవే రోడ్ల పక్కన హోటళ్లలా కార్లు ద్విచక్ర వాహనాలతో మందుబాబులతో ఎంత సందడో చెప్పనక్కర్లేదు, మద్యం మత్తులో ప్రమాదాలకు కూడా పాల్పడుతున్నారు.రేపటి పౌరులైన విద్యార్థులు యువకులు వీటికి ఆకర్షితులవుతున్నారు. విష సంస్కృతికి బలైపోతున్నారాన్నారు. అసాంఘిక కార్యకలాపాలు మరియు దొంగతనాలు అరికట్టడానికి కాలనీలో మరియు ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ పార్క్ వద్ద ఎస్ టి పి ప్లాంట్ వద్ద బొంబాయి కాలనీ సెంటర్ లో తక్షణమే సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మఫ్టీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వ పెద్దలు  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  చెప్పినట్లుగా మణుగూరు పోలీసు ఎక్సైజ్ శాఖల సమన్వయంతో సింగరేణి ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టాలన ఆయన కోరారు.

Join WhatsApp

Join Now