ముదిరాజ్ పెద్దమ్మ గుడికి సీసీ రోడ్డు – ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి దాతృత్వం ప్రశంసనీయం
యాడారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధుల మంజూరు
మాట నిలబెట్టుకున్న రమణారెడ్డి – ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది
ముదిరాజ్ సదర్ సంఘం తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
మండల, జిల్లా బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం
గ్రామాభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామన్న హామీ
యాడారం, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి శాసనసభ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన సొంత నిధులతో ఇచ్చిన మాట ప్రకారం బీబీపేట్ మండలం యాడారం గ్రామంలోని ముదిరాజ్ పెద్దమ్మ గుడికి సీసీ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా యాడారం ముదిరాజ్ సదర్ సంఘం తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా నాయకుడు నక్క రవీందర్, మండల అధ్యక్షుడు అల్లం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు అమ్రిష్, ప్రధాన కార్యదర్శి పిడుగు శ్రీనివాస్, యాడారం మాజీ అధ్యక్షుడు బట్టు భరత్, మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే రమణారెడ్డి దాతృత్వాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.