సిసి రోడ్లు వేశారు నాణ్యత మరిచారు..?
– పర్యవేక్షణ లేని అధికార యంత్రం..?
– నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు…?
– కొరవడిన ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ.?
– రామారెడ్డి మండల కేంద్రంలో..!
కామారెడ్డి (మే 05)
రామారెడ్డి మండల కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా సిసి రోడ్ల మరమ్మతులను చేపట్టారు. సిసి రోడ్లు వేసి కూడా నెల 15 రోజుల పై మాటే, అయితే సిసి రోడ్లు వేశారు నాణ్యత మార్చారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఇందుకు గల కారణాలను అధికారులు ఏం చేస్తున్నట్లు, పర్యవేక్షణ కరువైందా..? లేక చేసేదేమీ లేక అధికార ప్రతినిధుల ఒత్తిడికి లోనైతున్నారా.?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రత్యేక ప్రాధాన్యతగా గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే వేగవంతంగా పనులు చేపట్టే క్రమంలో నిబంధనలు పాటించక, నాణ్యతాలేమి పనులు చేపట్టడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పలుగ్రామాలలో ఒకేసారి సిమెంట్ రొడ్ల నిర్మాణం చేపడుతుండగా, కొన్ణి గ్రామాలలో నాణ్యతాలోపం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనుల్లో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుకను, అదేవిధంగా డస్ట్ ఎంత వాడాలో..? డస్టువాడ లావద్దా..? అంతమెరకు మాత్రమే వాడాలి. తదుపరి నాణ్యమైన సిమెంటును నిర్ధేశిత పాళ్లలో వేయకుండా, తక్కువ సిమెంట్, మోతాదుతో మించి ఇసుక, డస్ట్ వేసి పనులు చేయడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ మేరకు రోడ్డు పనుల నాణ్యతాలేమి పై అధికారులు పర్యవేక్షణ లేదని అదేవిధంగా వేసిన సిమెంట్ రోడ్డుపై కట్టలు కట్టి నీళ్లు ఆపలేక అరి గడ్డితో తడపడం ఈ యొక్క వేసవి గంటలకు గడ్డి ఎండిపోవడం రోడ్డు పగిలిపోవడం జరిగిన అంతేగాక నాణ్యతంగా రోడ్లు వేయకపోగా ఇరువైపులా మొరం పోయకపోవడం మరో విడ్డూరం.మరోసారి నాణ్యత పరిమాణాలను నిర్వహించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.ఇంత జరిగినా ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిలో భాగంగా పర్యవేక్షణ పై చిత్తశుద్ధి ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రారంభంలో వచ్చి తగు సూచనలిచ్చి వేరే చోట పనికి వెళ్ళేసరికి, సంబంధిత కాంట్రాక్టర్ నిబంధలన్నీ గాలికొదిలేసి పనులు చేపట్టారానీ ఆరోపిస్తున్నారు. దీనిపై మండల అసిస్టెంట్ ఇంజనీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? మండలంలో పలు గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు ఇదే విధంగా కండ్లకు కట్టినట్టు కనపడుతున్నాయి. అన్ని గ్రామాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షణలోనే పనులు చేపడుతుండగా, కొన్ని చోట్ల పనుల నాణ్యతపై ఫిర్యాదుల అందే అవకాశాలు ఉన్నాయి. ఆయా రోడ్ల నాణ్యతను పరిశీలించి, నిర్ధారించుకున్నాకే బిల్లులు చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మరోసారి పర్యవేక్షించి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, సదర్ కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని వేచి చూడాల్సిందే.