కామారెడ్డిలో సీసీఎస్‌ “Chase • Catch • Solve” పోస్టర్ ఆవిష్కరణ

కామారెడ్డిలో సీసీఎస్‌ “Chase • Catch • Solve” పోస్టర్ ఆవిష్కరణ

 

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 20

 

 

 

జిల్లా సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (CCS) విభాగం కొత్త క్యాప్షన్‌ పోస్టర్‌ “Chase • Catch • Solve”ను శనివారం జిల్లా ఎస్పీ యం. రాజేష్‌ చంద్ర, ఐపీఎస్‌ ఆవిష్కరించారు. నేరస్థులను వెంబడించి పట్టుకుని కేసులు ఛేదించే విధానాన్ని ప్రతిబింబించేలా ఈ క్యాప్షన్‌ రూపొందించామని ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ –

“ఈ ఏడాది జిల్లాలో ఆస్తి సంబంధిత కేసుల్లో 46 శాతం నేరాలను ఛేదించగా, 42 శాతం సొత్తును తిరిగి బాధితులకు అందించగలిగాం. అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచి ఇప్పటివరకు 10 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. వీటిలో మహారాష్ట్రకు చెందిన 4, మధ్యప్రదేశ్‌ 3, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఒక్కొక్క గ్యాంగ్‌ ఉంది. దొంగతనాల నివారణకు ప్రతిరోజూ నాఖ భంధీ, పెట్రోలింగ్‌, బీట్‌ డ్యూటీలను పకడ్బంధీగా నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.

 

సీసీఎస్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఉస్మాన్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ వారికి నగదు బహుమతులు అందజేశారు.

 

అదేవిధంగా –

“ప్రజల సహకారం అత్యంత అవసరం. ఎవరైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగానే ఉంచబడతాయి” అని ఎస్పీ స్పష్టం చేశారు.

 

కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, యెల్లారెడ్డి డీఎస్పీ ఎస్‌. శ్రీనివాస్‌రావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్‌ టి. శ్రీధర్‌, సీసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now