మర్కుక్ సెప్టెంబర్ 9 ప్రశ్న ఆయుధం :
ప్రజా కవి కాళోజి నారాయణ 111వ జయంతిని పురస్కరించుకొని ఎర్రవల్లి గ్రామంలో ని యువకులు సోమవారం ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష, తొలి దశ మలిదశ ఉద్యమాల్లో పాల్గొని మూడు తరాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు కాలోజి నారాయణరావు ఆయనను ఈ సందర్భంగా స్మరించుకోవడం హర్షించదగ్గ విషయమని రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ అధ్యక్షులు తుమ్మ కృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం లో ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు కమ్మరి బాలరాజు మాట్లాడుతూ. మన ప్రాంతం వాడు కాకపోయినా తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన మహానీయుడు. ప్రొఫెసర్ జయశంకర్ కు. కెసిఆర్ లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన మహనీయునికి నివాళులర్పించడం ఎంతో సంతో దాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ మండల అధ్యక్షులు సిహెచ్ కృష్ణ. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు మల్లేశం. సలేంద్రం కొమురయ్య, యాదగిరి. రవి. నవీన్. తదితరులు పాల్గొన్నారు.