కొత్తగూడెంలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2009 నవంబర్ 29 ఉద్యమ చరిత్రలో లిఖించిన రోజు..

దీక్షా దివాస్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని జయప్రదం చేయండి.BRS మండల కన్వీనర్
ఆకోజు సునీల్ కుమార్.తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చరిత్ర లిఖించిన రోజు 2009 నవంబర్ 29 అని ఆనాడు తెలంగాణ వచ్చుడో. కేసీఆర్ సచ్చుడో అని నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుడు కేసీఆర్ అని. అనేక పదవులను సైతం త్యాగం చేసి తెలంగాణలో ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఢిల్లీకి చాటి చెప్పి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు తలవంచి తెలంగాణ ఇచ్చే పరిస్థితిని తీసుకువచ్చిన గొప్ప ఉద్యమ నేత కేసిఆర్ అని అన్నారు .
అట్టి రోజుని స్మరించుకుంటూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దీక్షాదివాస్ కార్యక్రమం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జరుగుతుందని ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కేసిఆర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని బిఆర్ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఒక ప్రకటన లో కోరారు.

Join WhatsApp

Join Now