అమరవీరుల జ్యోతి యాత్రను జయప్రదం చేయండి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపు.
సిద్దిపేట జనవరి 7 ప్రశ్న ఆయుధం :
జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగే జీపు జాతను ఈనెల 19 వ తేదీ న సిద్దిపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను గ్రామాలలో ప్రచారం చేస్తూ 25 వ తేదీన సంగారెడ్డి పట్టణంలో జరిగే భారీ బహిరంగ జరిగే నాటికి సంగారెడ్డికి చేరుకుంటుందని, ఈనెల 24 వ తేదీన బైరాన్ పల్లి బురుజు నుండి అమరవీరుల జ్యోతి యాత్ర ప్రారంభించి 25 వ తేదీన సంగారెడ్డి లో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ బృందాకరత్ కి అందించడం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు తెలిపారు. సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎం ప్రజల పక్షాన అనేక పోరాటాల నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తుందని అనేక విజయాలు పోరాటాల ద్వారా సాధించిందని ఆ పోరాటాలను సమీక్షించమని ప్రజలను సమస్యల నుండి విముక్తి చేయడానికి ఉద్యమాలు రూపొందించడానికి రాష్ట్ర నాలుగవ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందు ఉంచడానికి సిపిఎం మహాసభలు వేదిక కానున్నాయని పాలకుల అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్పొరేట్ అనుకూల విధానాలపై రానున్న కాలంలో ప్రజల్ని సమీకరించి ప్రజాస్వామ్య, లౌకిక తత్వ, రాజ్యాంగ పరిరక్షణ కోసం, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయాలను ప్రజల ముందు ఉంచడానికి సిపిఎం మహాసభలు వేదిక కానున్నాయని ఆ నేపథ్యంలో నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రమైన బైరాన్ పెళ్లి బురుజు నుండి అమరవీరుల జ్యోతి యాత్రను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి గారు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, సంద బోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డు బర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు కొంగర్ వెంకట్ మావో, బద్దిపడి కృష్ణారెడ్డి, చొప్పరి రవికుమార్, అమ్ముల బాల నరసయ్య, బండ కింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, సింగిరెడ్డి నవీన, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్ లు పాల్గొన్నారు.