ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామంలో మంగళవారం మాజీ ప్రధాని స్వర్గీయ నేత ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంచి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.