Site icon PRASHNA AYUDHAM

ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

WhatsApp Image 2025 01 12 at 8.20.03 PM

మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

గజ్వేల్ లో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నేతలు

గజ్వేల్, 12 జనవరి 2025 : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ లోక్ సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను ఆదివారం గజ్వేల్ లోని స్థానిక సమీకృత మార్కెట్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వాంచారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులతో కలిసి నర్సారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రియాంక గాంధీ దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలుపొందారని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ రాబోయే రోజుల్లో మరో ఇందిరాగాంధీలా దేశ ప్రజలకు కనిపించబోతున్నారని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ప్రియాంక గాంధీలో తమ ప్రియతమ నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీని చూసుకుంటారని చెప్పారు. ప్రియాంక గాంధీ నిండు నూరేళ్లు చల్లగా జీవించి, ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రంలో గజ్వేల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Exit mobile version