ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం
ప్రశ్న ఆయుధం,కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 55 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి అనంతరం ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ జెండాను ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ గత 55 సంవత్సరాలుగ అధ్యయనం పోరాటం నినాదాలతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాల నిర్వహించి అమరులయ్యారని వారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా సమరశీల పోరాటం నిర్వహించడంలో ఎస్ఎఫ్ఐ ముందు పాత్ర ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తు పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్, నితిన్, సమీర్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.