*ఘనంగా దివంగత మాజీ మంత్రి ఎంఎస్ఆర్ జయంతి వేడుకలు*
*జమ్మికుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ మాజీ పిసిసి అధ్యక్షుడు దివంగత ఎం సత్యనారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెస్సార్ ప్రియ శిష్యుడు జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత తుమ్మేటి సమ్మిరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తుమ్మే టి సమ్మిరెడ్డి విద్యార్థి దశ నుంచి ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ పిసిసి మీడియా సెల్ కన్వీనర్ గా జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవులు అధిరోహించి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకంగా సమ్మిరెడ్డి నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరుశరామారావు జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య దిడ్డి రామ్ రావికంటి రాజు కుతాడి రాజయ్య డైరెక్టర్ సూర్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి సలీం పాతకాల అనిల్ లింగంపల్లి లింగారావు పాపిరెడ్డి కాగితం శీను యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బుడిగె శ్రీకాంత్ యువజన కాంగ్రెస్ నాయకులు పర్లపెల్లి నాగరాజ్ ఎండి సజ్జు మహిళా నాయకులు పిడుగు భాగ్య తోట స్వప్న తదితరులు పాల్గొన్నారు.