ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

 విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో

ప్రశ్న ఆయుధం – – కామారెడ్డి

విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. 

ఈసందర్భంగా విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం 65 సంవత్సరాలుగా అధికారికంగా నిర్వహిస్తుందని, దివ్యాంగుల సంక్షేమ పథకాల్లో నిర్లక్ష్యం చేయడం సరికాqదని అన్నారు. ఇప్పడికైన ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా నిర్వహించాలని, పెన్షన్ భిక్ష కాదు గౌరవ వేతనంగా గుర్తించి ప్రతి నెలా 5వ తేది లోపు పంపిణీ చేయాలని, ఉపాధి,ఉద్యోగ, విద్య,వైద్య, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్థిక ఋణాలు, మోటారైజ్ వాహణాములు,పరికరాల పంపిణీ చేయాలని,వివాహక ప్రోత్సాహం ఎప్పడికప్పుడు, ఉపకార వేతనాలు, దివ్యాంగుల బడ్జెట్ అధికంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇప్పడికైన రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో పంగ ఈశ్వర్, గాడి నర్సింలు, నితీష్ రెడ్డి, రంగ్యనాయక్,ముదులో శంకర్,కోండల్ రెడ్డి, బంటు స్వామి,బంజ రాజు,పేరుమండ్ల రవి,నరేందర్, రాజు,గాండ్ల సాయిలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment