*ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివార్ వేంకటాపూర్ గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కులస్తుల మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో తమ జాతి జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు.మత్స్యకారుల సంఘం అధ్యక్షులు పుట్టా దయానంద్,గ్రామ ముదిరాజ్ సంఘం పెద్దలు మాట్లాడుతూ జల పుష్పాలే పాడి పంటలుగా భావించి నిత్యం సడిలోనే జీవనం కొనసాగిస్తున్నటువంటి సొసైటీలో సభ్యత్వం లేని మత్స్యకారులకు కొత్తగా మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని,18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కారునికి సభ్యత్వం ఇవ్వాలని అన్నారు.మత్సాకారులకు భద్రతా చట్టం తీసుకురావాలని ఉచిత చేప పిల్లల స్థానంలో ఆయా సొసైటీలకు నగదు బదిలీ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం ఉపాధ్యక్షులు గుర్రాల రాజు,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బచ్చలి జహంగీర్,మత్స్యకార సంఘం సభ్యులు నర్సింలు,గుర్రాల స్వామి,పుట్ట కిష్టయ్య,పుట్ట సత్యనారాయణ,శేరు పోచయ్య,కానమైన రాజు,తుమ్మల గంగాధర్,సంద జమిందార్,పుట్ట చంద్రం,బాల్ చంద్రం,రమేష్,బాల కృష్ణ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.