*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
జిల్లా ప్రగతి వివరాల నివేదికను వివరించిన కలెక్టర్
పోలిసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, , ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా లోని ఎన్టీఆర్ స్టేడియం లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
వేడుకలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా సమగ్ర ప్రగతి నివేదికను చదివి వినిపించారు. స్వాతంత్ర్య సమరయోధులను కలెక్టర్, ఎస్పీ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ , ఎస్పీ, ఎంపీ బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు.
అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్, ఎస్పీ అందజేసి అభినందనలు తెలియజేశారు.
స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎగురవేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరభ్రహ్మచారి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులు, స్వాతంత్య సమరయోధులు, కవులు, కళాకారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.