ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు
ప్రశ్న ఆయుధం 1ఆగష్టు
మేడ్చల్ జిల్లా
మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మూడు చింతలపల్లి మండల అధ్యక్షుడు నల్ల కృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పిస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల కిందట 11 మందితో ఏర్పాటైన ఎమ్మార్పీఎస్ నేడు లక్షలాదిమందితో కొనసాగుతూ ఎమ్మార్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించ తగిన విషయమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ కృషి ఫలించిందన్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జెర్రీపోతుల నరసింహులు, కేశపురం మాజీ సర్పంచ్ ఇస్తారి, అద్రాస్ పల్లి మాజీ ఉపసర్పంచ్ జహంగీర్, కొల్టురుమాజీ సర్పంచ్ శిల్ప యాదగిరి, నాయకులు నవీన్, మాదిగ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి విజయ్, పారుపల్లి ఎల్లం, కొమ్ము నరేష్, నర్సింలు, ఇరుమయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.