*_ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు_*
*చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన యువజన, సీనియర్ కాంగ్రెస్ నాయకులు*
*జమ్మికుంట హుజురాబాద్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 28*
స్వాతంత్ర సమరయోధుడు గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్ ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారని ప్రాణాలను సైతం అర్పించారని వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ అని ఆయన పేరు వింటే చాలు యావత్ భారతావని రక్తం గర్వంతో ఉప్పొంగుతుందని ఆయన ఆశయాలు ఆలోచనలు ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందని గొప్ప విప్లవకారుడిగా స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలతో పోరాడారని మహాత్మా గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడని 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతంతో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల ఆగ్రహాన్ని పెంచుకోని లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ పెళ్లిని కూడా తప్పించుకుని దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశీలి భగత్ సింగ్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సందమల్ల బాబు బి ఆర్ గౌడ్ దుబాసి బాబు కే ఆర్ భిక్షపతి రాఘవేంద్ర సమ్మయ్య ముక్క రమేష్ నర్సింగం యువజన కాంగ్రెస్ నాయకులు చల్లూరి విష్ణువర్ధన్ ముక్క రవితేజ ఆకునూరి అజిత్ బన్నీ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు