నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి డిసెంబర్ 25:
ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండల కేంద్రంలోని బెతానీయ చర్చ్, ఎమ్మేస్సి ఫారం సెయింట్ థామస్, వడ్డేపల్లి సెయింట్ పాల్స్ చర్చ్, లతో పాటూ పోచారం,జానకంపేట్, ఏ.ఆర్.పీ, ఆoబం(వై) గ్రామాలలో గల చర్చిలలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పిల్లాపాపలతో క్రైస్తవ సోదరులు, మహిళలు నూతన వస్త్రాలు ధరించి చర్చ్ల వద్దకు చేరుకొని ప్రత్యక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బేతానియా చర్చ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ తిమోతి రాజు, వడ్డేపల్లి చర్చ్ ఫాదర్ సంజీవ్ కుమార్ లు మాట్లాడుతూ..ప్రతిఏటా క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు . క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. పండగ సందర్భంగా చర్చిలలో చిన్నారులు, మహిళలు, యువకులు, క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో సందడి చేస్తు ఏసుక్రీస్తు నామాన్ని స్మరించారు. బేతానేయ చర్చ్ లో చర్చి ఫాదర్ తిమోతి రాజు క్రైస్తవులకు సందేశాలు ఇచ్చారు. క్రిస్మస్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
క్రిస్మస్ పర్వ దినాన్ని పురస్కరించుకొని బేతానియా చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ నాయకులు కందగట్ల రామ్చందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శంకర్ నాయుడు, మాజీ ఎంపిపి భాస్కర్ రాజు, నాయకులు నాగునూరి రాజశేఖర్,ఎడపల్లీ మాజీ సర్పంచ్, భారాసా నాయకులు ఆకుల శ్రీనివాస్ లు తమ తమ పార్టీల నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు పండగ శుభాాంక్షలు తెలియజేశారు. ప్రజలందరు సోదరభావంతో మెధగాలని ఆకాంక్షించారు. వడ్డేపల్లి చర్చ్ లో పండగ వేడుకల సందర్భంగా ప్రత్యెక ప్రార్థనలు కొనసాగాయి. యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన భక్తి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, చర్చ్ లో ఏర్పాట్లను నిర్వాహకులు, కమిటీ సభ్యులు విద్యాసాగర్, కత్తుల శంకర్, స్టువర్ట్, అబ్రహంలు పర్యవేక్షించారు.