ఘనంగా తెలంగాణా ప్రజా పాలన వేడుకలు
ములుగు సెప్టెంబర్ 17 ప్రశ్న ఆయుధం :
సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన ములుగు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి శోభ అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సలీం కాంగ్రెస్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొండు నరసింహులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగ సత్యనారాయణ గౌడ్, కడపల్ల కృష్ణారెడ్డి, చింతకింది రాజ్,చాకలి రాజు, హనుమంత్ రెడ్డి, కడపల్ల నరసింహారెడ్డి, శివారెడ్డి, లకడబోయిన ముత్యాలు, ఊరేనక పోచయ్య , తూర్పుంటి రాజు, బుడిగ మహేష్ మహంకాళి ఎల్లం తదితరులు పాల్గొన్నారు.