గాజు గ్లాసు గుర్తుకి ఉత్తర్వులు
సంబరాలు జరుపుకున్న జన శ్రేణులు
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 08: కూకట్పల్లి ప్రతినిధి
గాజు గ్లాసు గుర్తుకి ఉత్తర్వులు జారీ చేసిన శుభవేళ జన శ్రేణులతో సంబరాలు జరుపుకున్న జనసేన- పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.
జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఇసి గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శుభ సందర్భంగా కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార కష్టపడి పని చేసిన జనసేన కార్యకర్తలకు ,వీర మహిళలకి, నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు , జన సైనికులకు మరియు వీర మహిళలకు మన జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు గాజు గ్లాస్ గుర్తుని ప్రజలలొకి తీసుకువెళ్లాలని సూచనలు ఇచ్చారు.