మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శత జయంతి వేడుకలు
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమరం మోహన్ రెడ్డి హాజరై వాజ్పేయి శత జయంతి సందర్భంగా గ్రామ గ్రామాన జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో ఘనంగా వారి జన్మదిన వేడుకలను నిర్వహించాము. ఆజన్మ బ్రహ్మచారి వారి జీవితాన్ని భరతమాతకు అర్పించిన వారు ఆరు సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పాలన అందించిన వారు ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి కార్గిల్ విజయం,విదేశాలతో సత్సంబాలు నెలకొల్పి లాహోర్ బస్సు యాత్రను ప్రారంభించి ,గ్రామీణ సడక్ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేయించిన ఘనత వాజ్పేయి ది, ఇలా చెప్పుకుంటూ పోతే వారు సాధించిన విజయాలు చాలా ఉన్నాయి వారి అడుగుజాడలలో మనమందరము నడవాలని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అమరం సరస్వతి, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, బూత్ అధ్యక్షులు కావేరి శ్రీధర్, సుంకు నవీన్, బట్టి కాడి విక్రమ్, బట్టి కాడి నవనీత, మలిగే శ్రీకాంత్, బాలే రావు అభిలాష్, సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, తప్పటి వినయ్,ఉద్దెమర్రి అరుణ్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు