ఉద్యమాల పురిటిగడ్డపై శతాబ్ది ఉత్సవం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసన సభ్యులు కూనంనేని

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
హలో కామ్రేడ్ చలో నల్లగొండ అంటూ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు పోరాటాల పురిటిగడ్డ పై 100 ఏళ్ళ వేడుకలు విజయవంతం చేయాలన్నారు.
ఈరోజు నల్గొండలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యమాలకు పురుడు పోసిన నల్లగొండ గడ్డ పై ఎంతో మంది కమ్యునిస్టు లీడర్లు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం అని,ఎంతో మంది శాసన సభ్యులు ఈ నల్లగొండ జిల్లా గడ్డ పై గెలిచి ప్రజా గొంతుకను అసెంబ్లీలో వినిపించారని,చరిత్రలో నల్లగొండ పేజీ సుస్థిరం అని ఎంతో మంది మేధావులకు పుట్టు నిలయమైన ఈప్రాంతంలో బహిరంగ సభ ను రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు నల్లగొండ లో అత్యంత వైభవంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న శతాబ్ది వేడుకను రాష్ట్ర నలుమూలల నుండి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు మేధావులు పార్టీ సానుభూతిపరులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వియవంతం చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now