2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి..

 

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గత ప్రభుత్వ తీరు వల్లే ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రం వెనకబడిందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులను వినియోగించుకుంటే ఇప్పటికే 5, 6 లక్షల ఇళ్లు కట్టించి ఉండొచ్చన్నారు. ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. నరేగా నిధుల వినియోగంలోనూ గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకొని జల్‌జీవన్‌ మిషన్‌ పూర్తి చేసుకోవాల్సిన అవసరముందని పెమ్మసాని అన్నారు.

Join WhatsApp

Join Now