ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సెంట్రింగ్ యూనిట్లు కీలకం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సెంట్రింగ్ యూనిట్లు కీలకం

శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు సర్టిఫికేట్లు పంపిణీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 17 

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో సెంట్రింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం శిక్షణ పూర్తి చేసిన 32 మంది లబ్ధిదారులకు కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన లబ్ధిదారులు ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాల వైపు మరొక అడుగు వేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో సెంట్రింగ్ యూనిట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శిక్షణ పొందిన లబ్ధిదారులు భాగస్వాములు కావాలి. ఇది మీ ఉపాధి ప్రగతికి మాత్రమే కాదు, జిల్లా గృహ నిర్మాణానికి కూడా తోడ్పడుతుంది,” అని కలెక్టర్ అన్నారు. లబ్ధిదారులు తమ యూనిట్లను స్థాపించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీ మంజూరు విషయాల్లో పరిశ్రమల శాఖ, బ్యాంకులు, DRDA మధ్య సమన్వయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. యూనిట్‌ల స్థాపనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా DRDA అధికారులు వెంటనే సహకారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారులు, అదనపు DRDO విజయలక్ష్మి, DPM సాయిలు, APM రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now