*ప్రధానమంత్రి నరేంద్ర మోది అద్యక్షతన కొత్త దిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది*
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-4 మిషన్ కి 2 వేల 104 కోట్లకు.. గిరిజన గ్రామాల అభివృద్దికి 79వేల 516 కోట్లు కేటాయింపుల చేసిందన్నారు.
పీఎం ఆశా పథకానికి 35 కోట్లు కేటాయింపులతో పాటు.. పోషకాల ఆధారిత సబ్సిడికీ 24వేల 475 కోట్లు కేటాయింపుల చేసిందన్నారు.
యువతకు సృజనాత్మక, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
బయో మానుఫాశ్చరింగ్, బయో ఫౌండ్రీ కోసం 9వేల 197 కోట్లకు కేంద్ర ఆమోదం తెలిపినట్లు వివరించారు.
వీనస్ ఆర్బిట్ మిషన్ కి కేంద్ర ఆమోదించినట్లు మంత్రి పేర్కొన్నారు.