సమాచార హక్కు కార్యకర్త నిఖిల్ డే
సిద్దిపేట సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :
పొరాడి సాధించుకన్న జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం చెస్తున్న కుట్రలను వ్యతిరేకించి ఉపాధి హమి పరిరక్షణకు ఉద్యమం చేయాలని ప్రముఖ సమాచార హక్కు కార్యకర్త నిఖిల్ డే పిలుపు నిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి పధకం అమలు పై దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో నిఖిల్ డే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హమి పధకం కు నిధులు తగ్గించడం తో కూలీలు తిరిగి వలసలకు వెళ్ళాల్సి న పరిస్థితి దాపురించిందన్నారు.గత మూడు సంవత్సరాలు గా పశ్శిమ బెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చెయకపొవడం వల్ల కూలీలు అర్ధాకలికి,వలసలకు దారి తీస్తుందన్నారు.ఉపాధి హమి ని హక్కుగా అమలుకు సంఘటితంగా ఉద్యమించాలన్నారు.కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల మ్యానిఫెస్టో లో హమి ఇచ్చినట్లు ఉపాధి హమి కూలీలకు కనీస వేతనం 400 రూపాయలకు పెంచుతామని హమిని కాంగ్రెస్ అధకారంలో వున్న రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. కొత్త గా ఎర్పాటు చెసిన మున్సిపాలిటీ, నగర పాలక సంస్థల ప్రాంతాలలో ఉపాధి హమి పనులను కొనసాగించాలన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో పట్టణ ఉపాధి హమి పధకాన్ని ప్రారంభించి అసంఘటిత కార్మికులకు పని ని హక్కుగా కల్పించాలన్నారు. పశ్శిమ బెంగాల్ లో పనులు ప్రారంభించాలని దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి కి పొస్ట్ కార్డు ఉద్యమం చెపట్టమన్నారు.కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హమిలో హమి ఇచ్చిన కూలీలకు భీమా సౌకర్యం, ప్రతి కూలీ కుటుంబానికి సంవత్సరం లో 12 వెల ఆర్ధిక మద్దతు అందించాలన్నారు
.ఈ సమావేశాలలో వివిధ సంస్ధల ప్రతినిధులు కె.యస్.గొపాల్,ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రుక్మిణిరావు,పద్మ,శివలింగం, వెంకటెశం,తదితరులు పాల్గొన్నారు.