ప్రజల ఉపాధిని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు
_కోట్లాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం
_ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి
– ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ డిమాండ్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 26:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలోని హక్కులను కాలరాసే విధానాలకు స్వస్తి పలకాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజి రాం బిల్లుతో కోట్లాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పని దినాలను ప్రస్తుతం ఉన్న పరిమితి నుంచి 125 రోజులకు పెంచాలని, అలాగే ఈ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు నేడు వారి కడుపు కొట్టే విధానాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తీసుకువచ్చిన విబిజి రాం బిల్లును రద్దు చేసి, జాతీయ ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.