ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని ప్రధాన మంత్రి కి పోస్ట్ కార్డు ఉద్యమం.
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
గజ్వేల్ సెప్టెంబర్ 18 ప్రశ్న ఆయుధం :
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులకు పనులు కల్పించకుండా, పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా పని హక్కులను,చట్టాన్ని ఉల్లంఘిస్తుందని బుధవారం నాడు గజ్వేల్ మండల్ అనంతరావు పల్లిలో ప్రధాన మంత్రి కి పొస్ట్ ద్వారా పంపే పొస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ని 2.75 కోట్ల మంది ఉపాధి కూలీలు ముఖ్యంగా దళిత,అదివాసి,ఒంటరి మహిళ లు ఆకలి తో అలమటిస్తు,వలస బాట పడుతున్నారని సర్కారుపై మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య,వివక్షత విడనాడి బెంగాల్ రాష్ట్ర ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని దేశ ప్రధానమంత్రికి దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించమన్నారు.
బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా,
పశ్శిమ బెంగాల్ కూలీలపై కక్ష సాధింపు,అమానవీయ చర్యలను మానుకొని బడ్జెట్ లో నిధులను విడుదల చెసి పనులను కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు దార లలిత,అంజవ్వ,పైడి మంజుల లక్ష్మీనర్సు,రాజు,రాజవ్వ,యాదవ్వ,దాసరి కిష్టవ్వ తదితరులు పాల్గొన్నారు.