సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలి బిజెపి నాయకుల డిమాండ్

సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలి బిజెపి నాయకుల డిమాండ్

ప్రశ్న ఆయుధం 04 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

సెంట్రల్ లైటింగ్ పనులను అర్ధంతరంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.శుక్రవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు అరుణతార ఆద్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరుణతార మాట్లాడుతూ… జుక్కల్ లోని పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లను తవ్వి వదిలేశారని ఆరోపించారు. మండల కేంద్రాలలో రోడ్లు గుంతల మయంగా మారి దుమ్ము దూలి తో పాటు వర్గం పడితే చిత్తడి చిత్తడిగా మారుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు ఇప్పటికైనా స్పందించి నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమం లొ కె. రాము,అభినయ్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment