ఈవీఎం, వీవీప్యాట్ వేర్‌హౌస్‌ను తనిఖీ చేసిన సీఈఓ సుదర్శన్ రెడ్డి

*ఈవీఎం, వీవీప్యాట్ వేర్‌హౌస్‌ను తనిఖీ చేసిన సీఈఓ సుదర్శన్ రెడ్డి*

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 9

IMG 20250609 WA1843

మల్కాజిగిరి జిల్లాలోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్), వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వేర్‌హౌస్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతం కూడా పాల్గొన్నారు.

తనిఖీ సందర్భంగా, సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారి మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేర్‌హౌస్ సీల్‌ను తెరిచారు. గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్‌ల పెట్టెలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం, వీవీప్యాట్‌లకు సంబంధించిన భద్రతా వివరాలను జిల్లా ఎన్నికల అధికారి సీఈఓకు వివరించారు.

తనిఖీ అనంతరం, అన్ని పెట్టెలను మళ్లీ వేర్‌హౌస్‌లో భద్రపరిచి, వారి సమక్షంలోనే గోడౌన్‌కు తాళం వేసి సీల్‌ చేశారు.

తనిఖీ ప్రారంభంలో జిల్లా ఎన్నికల అధికారి గౌతం పూలమొక్కతో సీఈఓ సుదర్శన్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, శామీర్‌పేట్ ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, అలాగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment