కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి:రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర
Headlines (Telugu)
  1. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్
  2. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలి
  3. 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ గోడౌన్ లను గుర్తించాలి.
రైస్ మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదు ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని డా బి ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, సిపిఓ సంజీవరావు, పౌర సరఫరాల అధికారి త్రినాధ్ బాబు , డిఎం నరేందర్, డీసీవో ఖుర్షిద్ , తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు పై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ చాలా ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న సమస్య రాకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని అన్నారు.
సన్నరకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాకు రూ,,500 రూపాయల బోనస్ ఇస్తున్న ట్లు తెలిపారు.
జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అన్నారు. దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను విడి విడిగా భద్రపరచాలని అన్నారు.
తాలు పేరుతో కోతలు పెట్టొద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని అన్నారు. రైతుకు ఎటువంటి నష్టం రావడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని దాని వల్ల కొనుగోలు ప్రక్రియ సులభం అవుతుందని మంత్రి సూచించారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలని, జీఓపై చర్చించాలని అవగాహన, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చని అన్నారు.
రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్
గోడౌన్లు సన్నద్ధం చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్ తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా సరిహద్దు వద్ద పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ* జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.వరి ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు వారి ఖాతాలో రెండు రోజుల్లో జమ అయ్యేందుకు పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డుకార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాఫీలు కొనుగోలు కేంద్రాల్లోనే అందజేస్తే రెండు రోజుల్లోనే వారి అకౌంట్లో నిధులు జమ చేస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.

Join WhatsApp

Join Now