ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
అంతర్జాతీయ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐ డి ఓ సి లో కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్బంగా బహిరంగ మలవిసర్జన యొక్క అనర్ధాలు, దాని వల్ల మన ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని జిల్లా అధికారులు చక్కగా వివరించడం జరిగినది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాలని, మరుగుదొడ్డి లేని గృహాలకు వెంటనే మరుగుదొడ్డి ఏర్పాటు చేశారా కార్యాచరణ ప్రారంభించి, డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం నాటికి పూర్తి చేయాలని తీర్మానించుట జరిగినది.
ఐక్యరాజ్యసమితి చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచంలో 350 కోట్ల మందికి ఇప్పటికీ మంచి పారిశుద్ధ్య అవకాశాలు లేవు. 41 కోట్ల మంది ఇంకా బహిరంగంగానే మలవిసర్జన చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. తగినన్ని మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం ప్రజారోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. తద్వారా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధుల వ్యాప్తికి దారితీస్తుంది. ఒకప్పుడు పారిశుధ్య విలువలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశుధ్యానికి ఎక్కువ విలువను ఇస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది పారిశుధ్యం పై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఎందుకు?ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం అనగానే అందరూ చదవకుండా చూపు తిప్పేస్తారు. నిజానికి ఇదే ఎంతో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది. ఆరు బయట మలవిసర్జన చేయడం వల్ల రకరకాల రోగాలు వ్యాప్తి చెంది ప్రాణాలు తీస్తున్నాయి 2001లో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి తొలిసారి ప్రారంభించింది. ఆరుబయట మలవిసర్జన కారణంగా ప్రజారోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతూ ఉండడాన్ని గమనించి దానిపై అవగాహన కల్పించేందుకే ఈ దినోత్సవాన్ని స్థాపించింది. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల నీరు కలుషితం అవుతుంది. ఆరు బయట మలవిసర్జన చేయడం వల్ల రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ రెండింటి వల్లే ప్రతిరోజూ ప్రపంచంలో ఐదేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు సుమారు వెయ్యి మంది మరణిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. వారందరి ప్రాణాలు కాపాడాలంటే పారిశుధ్య రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఆరు బయట మలవిసర్జన మానేయాలి.
మనదేశంలో పారిశుధ్ధ్యాన్ని మెరుగుపరచడానికి స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించారు. 2014 నుండి ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లోనే మరుగుదొడ్లను నిర్మించి ఇస్తున్నారు. లక్షల పబ్లిక్ టాయిలెట్లను కూడా నిర్మించారు. కానీ వాటిని పూర్తిగా వాడుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇంకా గ్రామాల్లో బయట మలవిసర్జనకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు, పారిశుద్ధ్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూ వున్నది. అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచి, ఆరోగ్య భరితమైన సమాజాన్ని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా అందరూ కృషి చేయాలని దీని ముఖ్య ఉద్దేశ్యము అని తెలియజేశారు.
టాలెంటెడ్ టెస్టులో విజేతలకు ప్రశంసా పత్రాలు ఐసిడిఎస్
by Naddi Sai
Published On: November 19, 2024 9:18 pm