తూర్పు గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారిగా సీహెచ్ లావణ్య
రాజమహేంద్రవరం:సెబ్ ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ గా విధులను నిర్వహిస్తున్న లావణ్యని రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారిగా బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య తొలుత ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఆగస్టు 2010 నుంచి 2012 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. తదుపరి సహాయ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మే 12 నుండి ఏప్రిల్ 14 వరకు శిక్షణ పొందారు. తొలి పోస్టింగ్ గా మే 14 నుండి జూన్ 16 వరకు ప్రొద్దుటూరు సహాయ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదుపరి జూలై 16 నుండి సెప్టెంబరు 18 వరకు ఒంగోలులో పనిచేశారు. అనంతరంఏపీఎస్బీసీఎల్ (APSBCL) అనకాపల్లి డిపో మేనేజర్‌గా ప్రో మరియు ఎక్సైజ్ సూపరింటెండెంటుగా పదోన్నతి పొంది అక్టోబరు 18 నుండి అక్టోబరు 19 వరకు విధులను నిర్వర్తించారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ గా జనవరి 20 నుంచి మే 20 వరకూ, తదుపరి సేబ్ ప్రధాన కార్యాలయంలో జూన్ 20 నుండి జూలై 23 వరకు, అనంతరం ఆగస్టు 23 నుండి ఇప్పటివరకు APSBCL ప్రధాన కార్యాలయంలో పనిచేస్తూ బదిలీపై రాజమహేంద్రవరం వచ్చారు.