నిర్వాసితులకు అండగా ఛాడ వెంకట్ రెడ్డి

నిర్వాసితులకు అండగా ఛాడ వెంకట్ రెడ్డి

గజ్వేల్ డిసెంబర్ 19 ప్రశ్నా ఆయుధం :

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురి అయిన నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారానికి మాజీ శాసనసభ్యులు ఛాడ వెంకట్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ మరియు సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ ఆధ్వర్యంలో నేడు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ని కలిసి, నిర్వాసితుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాసితులకు ఎల్లవేళలా సిపిఐ పార్టీ తరుపున తాము అండగా ఉంటామని నిర్వాసితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లన్న సాగర్ నిర్వాసితులు పోచయ్య, రమేష్, కనకయ్య, బాలయ్య మరియు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now