వాకిలి ఊడుస్తుండగా గొలుసు అపహరణ..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 04
వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. మూడో టౌన్ పరిధిలోని గౌతమ్ నగర్లో అనసూయ అనే వృద్ధురాలు శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ సమయంలో దుండగుడు నడుచుకుంటూ వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.