కామారెడ్డిలో చైన్ రాబరీ కేసు చేదింపు – 48 గంటల్లో నిందితులు పట్టుబాటు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 20
కామారెడ్డి పట్టణంలో మహిళపై జరిగిన చైన్ రాబరీ కేసును పోలీసులు వేగంగా చేదించి 48 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా, గాంధీ నగర్‌లో సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 4.40 గంటల సమయంలో దండేపల్లి అనసూయ అనే మహిళ తన మనమడిని స్కూల్ నుండి తీసుకొని ఇంటికి వస్తుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. ఈ ఘటనపై కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్‌పీ బి.చైతన్య ఐపీఎస్, పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా నిందితులు ప్రయాణించిన మార్గాలను విశ్లేషించగా, నిందితులు ఉపయోగించిన బైక్ నెంబర్ పాక్షికంగా గుర్తించారు. ట్రాఫిక్ విభాగం ఈ-చలాన్ డేటాబేస్ ఆధారంగా వాహనం యజమాని, ఫోటోలను పోల్చి అనుమానితులను కుదించారు.
వెంటనే ముచర్ల గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి,ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను మరియు తన తోడు, అదికాం బాబా గౌడ్ కలిసి నేరాన్ని చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుండి మూడు తులాల బంగారు గొలుసు, నేరానికి వాడిన స్ప్లెండర్ ప్లస్ బైక్ (ఫేక్ నెంబర్: AP 15 AX 5768, అసలు నెంబర్: AP 15 AX 5766), అలాగే ఒక రియల్‌మీ మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ముచర్ల భాస్కర్ రెడ్డి (s/o నర్స రెడ్డి), అదికాం బాబా గౌడ్ (s/o చిన్న సాయగౌడ్) లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ దర్యాప్తులో వేగవంతమైన చర్యలు తీసుకొని నిందితులను పట్టిన టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ నరేష్, సిబ్బంది ఏఎస్ఐ రంగారావు, బి.కమలాకర్, రాజు, సంపత్, నరేష్, భాస్కర్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
👉 48 గంటల్లోనే రాబరీ కేసును చేదించిన కామారెడ్డి పోలీసులు ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.