రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు

*తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ సంఘం కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ను సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు రామారావు*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ సంఘం కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని హైదరాబాదులో వారి స్వగృహంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంగిలే రామారావు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు అనంతరం రామారావు మాట్లాడుతూ రైతుపక్షపాతి రైతాంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం తపించే అపర భగీరథుడు భీష్మ పితామహుడు కోదండ రెడ్డి అని రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రైతు బాధలు ఎరిగిన వ్యక్తి అయినందున రైతు సంక్షేమ సంఘం కమిషన్ చైర్మన్ గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందని అన్నారు కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పత్తి క్రిష్ణా రెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు రమేష్ హుజురాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు స్వామిరెడ్డి చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now