ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 26 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. నేటి సమాజంలో ఐలమ్మ ఆశయలను, పట్టుదల కృషిని సమాజంలో అందరికీ తెలియజెప్పి, బానిసత్వాన్ని నశింపజేసి, అందరూ చైతన్యవంతంగా ఉండేవిధంగా పాటుపడాలని రజక సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు