ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 26, కామారెడ్డి :
జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ 129వ జయంతివేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పరిపాలనను ఎదిరించి భూమి కోసం,వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం పారాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని,వారి పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకొన్నప్పుడే మనం ఐలమ్మకి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్,టీజేఏస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్,గిరిజన సంఘం అధ్యక్షుడు వినోద్ నాయక్,ఉపాధ్యక్షుడు పూల్ సింగ్ రాథోడ్,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.