*భూమికోసం భుక్తి కోసం వెట్టు చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 10*
మండల కేంద్రంలో రజక సంఘ మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య ఆధ్వర్యంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ 39వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీర వనిత చిట్యాల( చాకలి) ఐలమ్మ అని పేర్కొన్నారు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తెలుసు ప్రతి ఒక్కరు వీర వనితలై గర్జించాలని కోరారు నేటి సమాజంలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఇల్లందకుంట వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్ మాజీ సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి కనుమల్ల సంపత్ రావుల పరశురాములు రావుల శ్రీనివాస్ వేణు రాజబాబు మల్లయ్య మల్లేష్ సాయికుమార్ వెంకటేష్ రాకేష్ సదయ్య తదితరులు పాల్గొన్నారు