ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 26, (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ యువ నేత మహేష్ నేతృత్వంలో చాకలి ఐలమ్మ 116వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోబడింది. దొరల, రజాకార్ల అరాచకాలను సవాల్ చేసి, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వీరురాలైన ఆమె స్ఫూర్తి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ, యువత సమాజంలో మార్పు తీసుకురావాలని, ఆమె ఆశయాలను కొనసాగించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.