Site icon PRASHNA AYUDHAM

బాధిత కుటుంబానికి సహాయం అందజేసిన చక్రధర్ గౌడ్

IMG 20240729 192713
సిద్దిపేట, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రామంచ గ్రామానికి చెందిన కుచ్చల కిషన్ అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్ గౌడ్ ఆ కుటుంబానికి వంద కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రాజు ముదిరాజ్, సుధాకర్, పాతూరి భూమ్ రెడ్డి, మచ్చ ఎల్లారెడ్డి, క్యాదాసి ఎల్లం, పెద్దిల్లి మల్లేశం, పల్లె పెద్ద రాములు, దానబోయిన శంకర్, జంగపల్లి శ్రీను, పరకాల రాజయ్య, పల్లె కిషన్, పుల్లూరు ఏరువ రాములు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version