దళితుల పెండ్లినీ అడ్డుకున్న చక్రపాణిని అరెస్టు చేయాలి

దేవాలయంలో దళితుల పెండ్లి ని అడ్డుకున్న చక్రపాణి ని అరెస్టు చేయండి.

డిఎస్పి ని ఆదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట సెప్టెంబర్ 01 ప్రశ్న ఆయుధం :

నారయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో యాదెవేంద్ర స్వామి అలయంలో దళితుల పెండ్లి అడ్డుకొని పెండ్లి చెయడానికి నిరాకరించిన పూజారి, ప్రభుత్వ ఉద్యోగి చక్రపాణిని తక్షణమే అరెస్టు చేయాలని నారయణ పేట డిఎస్ పి లింగయ్య ఆదెశించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్వర్యంలో దళిత సంఘాల నేతలు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను కలిసి నారయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో గ్రామంలోని యాదవేంద్ర స్వామి దేవాలయం లో అందరిలాగానే దళితుడైన ఓబులేష్ పెండ్లి చెసుకొవడానికి వెళ్ళగా అలయ పూజారి ,కృష్ణ మండలం ఎం పి డి ఒ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి చక్రపాణి గుడిలో దళితుల పెండ్లి చేయడం కుదరదని నిరాకరించి కుల వివక్ష అంటరానితనం పాటించాడని చైర్మన్ కు వివరించారు .మడుమల్ న్యాయ పోరాట కమిటి అధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని వివరించారు. ఇందుకు స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య నారయణ పేట డిఎస్పి లింగయ్యకు పొన్ చెసి కుల వివక్ష పాటించిన పూజారి చక్రపాణి ని తక్షణమే అరెస్టు చేయాలని అదేశించారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతు గుడి కి తాళం వేసుకొని పొవడంతో తప్పని పరిస్ధితిలో బంధువుల ముందు అవమాన భారంతో గుడి బయట నె పెండ్లి చెసుకున్నారన్నారు. బాధితుడు ఒబులెష్ పిర్యాదు మేరకు కృష్ణ పోలీసులు నిందితుడై న చక్రాపాణి పై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారన్నారు. దళిత,ప్రజా సంఘాలతో ఎర్పడిన ముడుముల్ న్యాయపొరాట కమిటి అధ్వర్యంలో జరుగుతన్న పోరాటం చెస్తున్నారన్నప్పటికి నిందితుడైన పూజారి,కృష్ణ యంపిడిఓ కార్యాలయ సినియర్ అసి స్టెంట్ చక్రపాణి ని ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చెశారు.అదె విధంగా నిందితుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించాలని కుల నిర్మూలనకు చర్యల తీసుకొవాలని కొరారు.ఈ కార్యక్రమంలో భాంసెప్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now