ఈనెల 23న జీవన భృతి కోసం చలో కలెక్టరేట్ 

ఈనెల 23న జీవన భృతి కోసం చలో కలెక్టరేట్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21కామారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా బీడీ కార్మికులకు 4వేల రూపాయలు జీవన భృతి ఇవ్వాలని ఈనెల 23న చలో కలెక్ట్ కార్యక్రమాన్ని ప్రతి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారన్నారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో సుమారు 60 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని, బీడీ కార్మికులకు కొన్ని బీడీ ఫ్యాక్టరీలు నాలుగు రోజుల నుండి పది రోజుల లోపు గానే పని దినాలు ఇస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో బీడీలు చుట్టే కార్మికులు బీడీ ఫ్యాక్టరీల నెలసరి జీతాల కార్మికుల కుటుంబాల జీవనం గడవడం తలకి మించిన భారమైందన్నారు, బీడీ ఉత్పత్తి పెంచాలని, పని దినాలు పెంచాలని అనేకసార్లు ఆందోళన చేసి బీడీ యాజమాన్యాలతో పోరాడి గొడవ పడినా పరిష్కారం కాలేదన్నారు. ఈ పరిస్థితులలో 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయూత పథకం ద్వారా 4000 రూపాయలకు పెంచి ఇస్తామని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా జీవన భృతి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయకపోవడం, బీడీ కార్మికులను నిరాశపరిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూత పథకం ద్వారా జీవన మృతి పెన్షన్ ప్రతి ఒక్కరికి ప్రతినెల 4 వేల రూపాయలు చొప్పున అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం 11 గంటలకు కొత్త బస్టాండ్ నుండి ఊరేగింపుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ ధర్నా చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతిపత్ర ని అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని బీడీ కార్మికులను కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల వీడియో వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎం వెంకట్, జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్, జాయింట్ సెక్రటరీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now