ఆరు గ్యారెంటీల అమలుకై ఫిబ్రవరి 20 న ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి 

ఆరు గ్యారెంటీల అమలుకై ఫిబ్రవరి 20 న ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి

ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్

యాదాద్రి భువనగిరి  ఫిబ్రవరి 16

గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతుందని అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ ఎద్దేవ చేశారు.యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం,బహుపేట గ్రామాలలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20 న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ,ప్రజలకు ప్రధానంగా ఉపయోగపడే రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు నెలకు 25 వందలు,వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12 వేలు, ఆటో కార్మికులకు 12 వేల రూపాయలు తదితర గ్యారెంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, ఏడవ గారెంటీగా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మిస్తానని చెప్పిన రేవంత్ ఎన్కౌంటర్లతో పాలన ప్రారంభించారని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం తను ఇచ్చిన ఆరు గారెంటీలను వెంటనే అమలు చేయాలని కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చిరబోయిన రాజయ్య భారత కార్మిక సంఘాల జిల్లా నాయకులు పంజాల మురళి ,భూష శ్రీశైలం, పి వై ఎల్ డివిజన్ అధ్యక్షులు పాకాల నరేష్,మండల నాయకులు మేకల వెంకటేష్, కుండె బీరయ్య, ఆసర్ల స్వామి,అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు చిరబోయిన కొమురయ్య,బుడిగే లక్ష్మయ్య, తలారి వెంకటేష్, జోగు శీను, బుడిగె ఐలయ్య, చీక నరేష్,పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఆర్‌.ఉదయ్,శివరాత్రి మహేందర్,జిట్ట బోయిన నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now