ఈనెల 25 న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అద్యక్షులు బాలనర్సు
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఈనెల 25 న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పచాయతీ కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అద్యక్షులు బాలనర్సు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల కు ప్రభుత్వం మే వేతనాలు ఇస్తామని చెప్పి 15 నెలలు కావస్తున్నా ఈనాటికీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం అసెంబ్లీ లో చర్చించి గ్రామ పంచాయతీ సిబ్బంది ని పర్మినెంట్ చేయాలని, వేతనాలు ప్రభుత్వం మే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలి చాలని వేతనం తో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించలంటె పోరాటాలె శరణ్యం అని కావున జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు ఈ నెల 25 న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం ను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల పాల్గొన్నారు.