చలో హైదరాబాద్ జయప్రదం చేయండ

చలో హైదరాబాద్ జయప్రదం చేయండ

లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమం విజయవంతం చేద్దాం.

గజ్వేల్ ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం :

కోట్లాది ప్రజల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7 న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని మాదిగల సంస్కృతిగా మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ప్రజ్ఞాపూర్ లోని ఏసీపి ఆఫీస్ ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లు ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం మరియు జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేవర్తి యాదగిరి , ఎంఈఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పరపల్లి నాగభూషణం , ఎంఈఎఫ్ గజ్వేల్ మండల అధ్యక్షులు సల్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా పార్టీలకు సంఘాలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు గుండ్ర నర్సయ్య , డాకని బిక్షపతి, నర్సి చంద్రయ్య, గుండ్ర నర్సింలు, సల్ల సత్తయ్య, సాయి నర్సింలు, ఈదుగాని శివులు, లాయర్ ఎల్లం, చిత్ర ఆర్ట్స్ నర్సింలు, గుండ్ర రామచంద్రం , నర్సి మల్లేశం, గూండ్ర సాయిలు, డాకని దత్తయ్య, గుండ్ర యాదగిరి, డాకని నర్సింలు, భూమిని లక్ష్మీ నర్సయ్య, క్యాసారం కృష్ణ , సల్ల మహిపాల్, ఈది స్వామి, సల్ల కిరణ్ , ఈది రవి , నర్సిలింగం,రాజి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now